Friday, June 8, 2018

ఆశా దీపం (కథ)


ఆఫీస్ కి బయలుదేరాడు శరత్  తన బైకుపై అసలే ఆలస్యం అయిపోతుందని చాలా కంగారుగా ఉన్నాడు అప్పుడే ట్రాఫిక్ సిగ్నల్ పడింది నిట్టూరుస్తూ సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్నాడు అంతలో ఒక పెద్దాయన కొంచెం దూరంలో కనిపించాడు ఆయన చూస్తే శరత్ కి తన చిన్నప్పుడు తన పక్కింటిలో ఉండే వెంకట్రామయ్య గారిలాగా ఉన్నారని గుర్తు చేసుకున్నాడు ఆ పెద్దాయన చూడటానికి చాలా బక్కగా మురికి బట్టలతో ఉన్నాడు ఒక్కసారి శరత్ అలాగే ఉండిపోయాడు ఆ తరువాత సిగ్నల్ పడింది  తన ఆఫీస్ కి బయలుదేరాడు ఆ రోజు month ending ఫైల్స్ అన్ని క్లియర్ చేసేటప్పటికి రాత్రి 12.30 అయ్యింది  ఆఫీస్ నుండి ఇంటికి బయలుదేరాడు
ఇంటికి చేరుకున్నాక  నిద్ర పోయాడు

ఆ మరుసటి రోజు ఆదివారం సెలవు కావటంతో లేటుగా నిద్ర లేచాడు నిన్న తను చూసిన పెద్దాయన గురించి ఆలోచించాడు ఆయన వెంకట్రామయ్య గారు ఆయనకు 10 ఎకరాల పొలం ఉంది అది వంశపార పర్యంగా సంక్రమించింది ఆయన దగ్గరకు వచ్చినవారికి లేదనుకుండా దానం చేసే సహృదయం కలవాడు ఆయనకు ఒక కూతురు, ఒక కొడుకు కూతురుకి అమెరికా సంబంధం చేశారు

ఇక కొడుకుకి బాగా చదివించారు  వెంకట్రామయ్య గారి భార్య సులోచనమ్మ ఆవిడ నా చిన్నపాటి నుండి మంచనికే పరిమితమయ్యారు మరి ఏమైందో తెలియదు ఇప్పుడు ఇలా కనిపించారు ఈ సారి కనబడితే అడగాలి అనుకున్నాడు ఆరోజు సాయంత్రం సినిమాకి వెళ్దాం అనుకుని బయలు దేరాడు శరత్ దారిలో మరలా కనిపించారు ఆ పెద్దాయన ఈ సారి దగ్గరికి వెళ్ళాడు శరత్

మీరు వెంకటరామయ్య గారు కదూ అనడిగాడు శరత్ ఆయన అవును అన్నారు మీరు ఇలా మారిపోయారు ఏంటి అనడిగాడు శరత్ దానికి ఆయన మా ఆవిడ 2 నెలల క్రితం కాలం చేసింది అందుకే అక్కడ ఉండలేక ఈ పట్టణానికి వచ్చేసాను అని సమాధానం చెప్పాడు మీకు అబ్బాయి ఉన్నాడు అనుకుంటా అన్నాడు శరత్
అవును ఉన్నాడు కానీ నన్ను ఈ ముసలి వయసులో ఇలా వదిలేసి పెళ్లి చేసుకుని ఫారిన్ లో  settle అయ్యాడు
కనీసం మా ఆవిడ చనిపోయిన తరువాత కూడా ఇంటికి రాలేదు బాబు అన్నాడు
 ఇంతకీ మీరు ఎవరు బాబు అనడిగాడు నేను శరత్ ని మీ ఇంటి పక్కనే ఉన్న రామచంద్ర రావు గారి కుమారుడిని అని చెప్పాడు శరత్

మీరు ఇలా మాసిన బట్టలతో ఉన్నరేంటి అనడిగాడు శరత్ దానికి  నేను ఇక్కడ పక్కనే ఉన్న apartment లో పనిచేస్తున్నాను అని చెప్పాడు వెంకట్రామయ్య అలా చెప్పగానే శరత్ కంటి లో నీళ్లు తిరిగాయి ఎక్కడుంటున్నారు అని అడిగాడు అక్కడే ఉంటున్నాను అని చెప్పాడు

సరే మా రూంకి రండి అని చెప్పి ఆయనను తీసుకెళ్తుండగా వద్దు బాబు నేను ఇక్కడే ఉంటాను దయచేసి ఏమి అనుకోవద్దు అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు

శరత్ అలాగే తను ఉంటున్న రూంకి బయలుదేరాడు గాని మనసు నిండా వెంకటరామయ్య గారి గురించి ఆలోచిస్తూనే ఉన్నాడు కన్న వాళ్ళని ముసలి వయసులో పట్టించుకోకపోతే వారి పరిస్థితి ఇలాగే ఉంటుంది అని చాలా బాధ పడ్డాడు కన్న తల్లి తండ్రులు తమ ఆశల్ని, తమ పుత్రులుపై
చూపిస్తారు వారు మాత్రం వారి అవకాశాలను చూసుకుంటూ తల్లి తండ్రులను వదిలేస్తారు అని శరత్ బాధ పడ్డాడు!!!

No comments:

Post a Comment

జన సేన !!!