Thursday, June 14, 2018

ప్రేమ భంగపాటు (కథ)


రైలు ఆగి చాలా సేపు అయినట్టుంది వెంటనే మెలకువ వచ్చింది నవీన్ కి లేచి మొహం కడుగుకుందామని రైలు భోగిలో ఉన్న bath room కి వెళ్ళాడు మొహం కడుక్కుని తిరిగి వస్తున్నాడు ఇంతలో కొందరు ప్రయాణికులు రైలు కిందకు డ్స్తుదిగి చూస్తున్నారు ఏమైంది అని అడిగాడు నవీన్ ఎదర track పాడై పోయింది అంటా రైలు బయలు దేరాటానికి టైం పడుతుందట అని చెప్పడు

 సర్లే అనుకుని కిందకి దిగాడు నవీన్ చుట్టూ ఎటు చూసినా చెట్లు అక్కడ కొంచెం దూరంలో ఒక గుడిసె లాగా ఉంది బహుశా అది డాబా అనుకుంటా అని నవీన్ అక్కడికి వెళ్ళాడు అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకుని రైలు దగ్గరకు బయలుదేరాడు ఇంతలో రైలు horn వేశారు ఆ కంగారులో నవీన్ వేరే భోగి ఎక్కాడు next station లో తన భోగికి వెళ్ళ వచ్చని అక్కడే కూర్చున్నాడు  తన కూర్చున్న seat కి ఎదురుగా ఒక అమ్మాయి కూర్చుని ఉన్నది

ఏమన్నా మాట్లాడాదం అంటే ఆ అమ్మాయి ఏమనుకుంటుందో అని చెప్పి ఏమి మాట్లాడకుండా అలాగే ఉండిపోయాడు ఇంతలో టికెట్ కలెక్టర్ దగ్గరలో వచ్చాడు నవీన్ తన టికెట్ వెతికాడు కానీ కనపడలేదు కంగారుగా మొత్తం తన జేబులు మొత్తం వెతికారు అయిన కనబడలేదు ఇక ఏమి చేయాలో తెలియటం లేదు
నవీన్ కి ఇంతలో ఆ అమ్మాయి గమనిస్తూనే ఉంది నవీన్ ని ఇక ఏమి చేయాలో తెలియక బాత్ రూమ్ లోకి వెళ్లి ఉండామనుకున్నాడు ఇంతలో ఆ అమ్మాయి నవీన్ కంగారు పడటం చూసి ఏమైంది అని అడిగింది

దానికి నవీన్ టికెట్ బ్యాగ్ లో ఉండిపోయింది ఆ బ్యాగ్ వేరే బోగీలో ఉండిపోయింది అని జరిగింది అంతా చెప్పాడు  ఆ అమ్మాయి మీరు ఏమి కంగారు పడకండి నేను fine కడతాను next వచ్చేది నేను దిగే స్టేషనే అక్కడ నా amount ఇద్దురు గాని అని చెప్పింది ఆ మాటతో కుదుట పడ్డాడు నవీన్ టికెట్ కలెక్టర్ వచ్చాడు ఫైన్ కట్టేసింది ఆ అమ్మాయి

చాలా థాంక్స్ అని చెప్పాడు నవీన్  ఇంతలో స్టేషన్ వచ్చింది నవీన్ వెంటనే తన భోగిలోకి వెళ్లి తన బ్యాగ్ లో అమౌంట్ తీసి ఆ అమ్మాయికి ఇచ్చేసాడు మీ పేరేమిటి అని అడుగుదాం అని అనుకున్నాడు ఇంతలో వాళ్ళ వారు ఎవరో వచ్చి  ఆ అమ్మాయిని తీసుకువెళ్లారు

కాసేపు ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తూ ఈ రోజుల్లో ఈ విధంగా సహాయం చేసేవారు ఎవరుంటారు అని ఆ అమ్మాయి మీద ఒక అభిమానం పెరిగింది ఇక రెండు స్టేషన్ దాటినా తరువాత నవీన్ దిగవాల్సిన స్టేషన్ వచ్చింది
నవీన్ ఆ స్టేషన్ లో దిగాడు

ఇంటికి వెళ్ళాడు అందరూ కులసా ప్రశ్నలు వేశారు fresh up అయ్యిక కాసేపటికి వాళ్ళ నాన్న గారు వచ్చి రేపు నీకు పెళ్లి చూపులకు వెళ్తున్నాం రెడీగా ఉండు అని చెప్పి.వెళ్లిపోయారు

ఆ మరుసటి రోజు పెళ్లి చూపులకు బయలు దేరారు పెళ్లి చూపులు మర్యాదలు అన్ని మామూలుగానే జరిగాయి.పెళ్లి కూతుర్ని రమ్మన్నారు ఆ అమ్మాయి వచ్చింది ఆ అమ్మాయే నవీన్ రైలులో కలసిన అమ్మాయి ఇక నవీన్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది లోపల చాలా ఆనందంగా ఉన్నాడు

వెంటనే వాళ్ళ నాన్న తో అమ్మాయి నాకు నచ్చింది పెళ్లి ok చేయించండి అని చెప్పాడు ఇంతలో ఆ అమ్మాయి
వాళ్ల అమ్మను పక్కకు.పిలిచి జరిగింది అంతా చెప్పింది ఆవిడ వాళ్ళ ఆయనని పిలిచి చెప్పింది

కాసేపటికి ఆయన బయటకు వచ్చి ఏ విషయం అన్నది మీకు ఫోన్ చేసి చెబుతాం అని చెప్పి వారిని పంపించేశారు

ఆ తరువాత రోజు ఫోన్ వచ్చింది ఈ పెళ్లి ఆ అంమ్యకి ఇష్టం లేదంట అని చెప్పాడు పెళ్లి కూతురు తండ్రి
ఎందుకు అని అడిగాడు ఆయన జరిగినది అంతా చెప్పి అంతా బాధ్యత రహిత్యంగా ఉంటే రేపు నన్ను ఎలా చూసుకుంటాడో అని చెప్పి పెళ్లి cancle చేయండి అని ఫోన్ పెట్టేసాడు

నవీన్ వాళ్ళ తండ్రి నవీన్ పిలిచి చివాట్లు పెట్టాడు ఆ పరిస్థితిలో ఏమి చేయాలో తెలియక అలాగే ఉండిపోయాడు నవీన్ !!!

No comments:

Post a Comment

జన సేన !!!